మన తెలుగు సినిమాల్లో తెలంగాణా మాట్లాడే వాళ్ళు రౌడీగా పనివాళ్ళుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు?
తెలంగాణా అంటే అంత చులకన మనకి, అది మైనారిటీ కింద జమకడతాం .. ఎలా అంటే, ఒక తెల్లవాడు ఆఫ్రికా పోయి అక్కడ వాళ్ళు అంతా మైనారిటీ అన్నట్టు, ఆంధ్ర లో వాళ్ళు తెలంగాణా వెళ్లి వాళ్ళని మైనారిటీ అనడం అంతే వెర్రి ఆలోచన.
అలాగ రెండు జిల్లలో వాడుక భాష అయిన తెలుగునే పత్రికల్లో ప్రచురించి, పద్యాలు ఇంక ఏ వాడుక భాషలో రాసిన అందులో సాహిత్యం లేదని, సరసం లేదని, ఇంకేదో లేదని కొట్టి పారేసి ఆంధ్రకవులు తమ భాష స్వార్ధాన్ని చాటేసుకున్నారు. ఆంధ్ర ప్రాంత సాహిత్య నిపుణులు ఏకపక్షంగా వారి ప్రామాణిక భాష, తెలుగు అని.. మరియు తెలంగాణ భాష. ఒక సాధారణ మాండలికంగా ఖండించారు. కేవలం రెండు జిల్లాలు వాడుక భాషగా ఉండే తెలుగు ని ఎక్కువ చేసి, తొమ్మిది కంటే ఎక్కువ జిల్లాలు మాట్లాడే తెలంగాణ భాషా మాండలికం గా ప్రకటించటం లో తెలంగాణా వాస్తవ్యులను తీవ్రమైన అవమానానికి గురిచేసారు.
మన రాష్ట్రం లో కవుల పేర్లు అడిగితే శ్రీనాధుడు, విశ్వనాధ శాస్త్రి, గబ్బిలం జాషువా, నన్నయ, ఎర్రాప్రగడ లాంటి కోస్తాంధ్ర కవులే ఎందుకు చెప్పుకుంటున్నాం? శ్రీ కాలోజీ నారాయణ రావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, గోన బుద్ధా రెడ్డి ఇంకెందరో ఉన్నారు వీరి గురించి ఎందుకు రాస్కోలేదు మన పుస్తకాల్లో? అచ్చ తెలుగులో ఎన్నో సంస్కృత పదాలు ఉన్నాయి, అలాంటి కట్టిన శబ్ద ప్రయోగానికి జై జై లు కొడతారు.. ఈమధ్య చొక్కా, నిక్కరు లాంటి చిన్న చిన్న వాడుక పదాలను ఇంగ్లీష్ లో పలుకుతారు.. అలా మాట్లాడితే ప్రోత్సహిస్తారు... కాని ఉర్దూ తో కలిసిన తెలుగు మాట్లాడితే, తురక తెలుగు అని హేళన చేస్తారు. Noam Chomsky చెప్పినట్టు, భాషలోనే ప్రాంతం యొక్క సంస్కృతి ఇమిడి ఉన్నాది. భాషాశాస్త్రం ఒక మానవశాస్త్ర విధానంగా పరిశోధన చేసారు. ఎవరి భాష వారికీ ఆనందం, వాడుక భాషనీ బ్రతికించండి,కానీ పక్కవారి భాషనూ కించపరిచి మన భాషను ఎక్కువ చెయ్యడం లో ఏ ప్రగతిశీలత కనిపించదు. ఈ దురాగతాన్ని ఆపుదాం, అందరిని, అన్ని భాషలని సమానం గా గుర్తిదాం.

No comments:
Post a Comment