Sunday, August 25, 2013

ఏమి దాగి ఉన్నదో సిగరేట్టులో

ఆటవెలది ॥
అన్నమైనా మాని ఆరుపూటలు గడుపు
పొగను మాని ఒక్క పూటయైన
గడుపలేదు దాని గడుసరితనమే మొ
ఎంత చిత్రమిది ఎంత వింత ..!!

ఆటవెలది ॥
ఒక్కసారి దాని పక్కజేరినచాలు
మత్తుజల్లి వాని మనసుమార్చు
సానికూడ నిట్లు సాహసించుట కల్ల
దాని మర్మమరయ తరముగాదు

No comments:

Post a Comment