Monday, November 18, 2013

బందిపోట్లు - Dacoits

పాఠం వోప్పచేప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులుగారు అన్నప్పుడే భయమేసింది
ఆఫీసులో నా మొగుడు ఉన్నాడు అవసరం వచ్చిన సెలవువ్వడని అన్నయ అన్నప్పుడే అనుమానమేసింది
వాడికేమి మగ మహారాజు అని ఆడ మొగ వాగినప్పుడే అర్థమైపోయింది

పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మొగుడంటే స్వెచ భాక్షకుదని
మేం పలిచి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోమ్దని

English -
When the teacher said:
I'll get you married off
if you don't recite the lesson
I was afraid.

When my brother said:
My 'husband' is my boss
who never grants me leave
even when I need it most
I grew suspicious.

When the neighbours said:
But, he's a man, a 'maharaja'
so what could he be missing?
I understood.

That marriage is a huge punishment,
that a husband gobbles up your freedom,
and that half the population
that we nourished at the breast
divides
and rules.

-ఓల్గా
ఆంధ్రజ్యోతి 1984

Sunday, August 25, 2013

ఏమి దాగి ఉన్నదో సిగరేట్టులో

ఆటవెలది ॥
అన్నమైనా మాని ఆరుపూటలు గడుపు
పొగను మాని ఒక్క పూటయైన
గడుపలేదు దాని గడుసరితనమే మొ
ఎంత చిత్రమిది ఎంత వింత ..!!

ఆటవెలది ॥
ఒక్కసారి దాని పక్కజేరినచాలు
మత్తుజల్లి వాని మనసుమార్చు
సానికూడ నిట్లు సాహసించుట కల్ల
దాని మర్మమరయ తరముగాదు

Sunday, August 11, 2013

చెరశాలలొ పడ్డది.. అక్కట

తరుణ కాలం వరుడు కొరకే లె..
వయసు ఆగనంది, మనసు తూలుతున్నది..
ఏ వలలో పడకూడదు అని అనుకుంటూ..
చెరశాలలో పడితిని కదా ...!!! అక్కట

వయసులో ఉన్న అమ్మాయి కి తరుణ కాలం లో పెళ్లి చేస్తారు ఒక వరునితో.  ఆ విషయం తెలిసిన అమ్మాయి జాగ్రత్త పడుతుంది.  వయసు పెరుగుతున్నా మనసుని కట్టడి చేసుకుని ఎవరి వలలో పడకూడదని ఆలోచిస్తూ పెళ్లి అయిన వెంటనే బాధ పడను చెరశాలలొ పడ్డది అని.. అక్కట

Sunday, August 4, 2013

singing in darkness

గోండు గుండెలో రగిలిన జ్వాలలు పోరు బాటలో విలీనమైనవి 
భూమి భుక్తి విముక్తి కొరకు పీడుతులందరు సాయిధులైరు... 
దోపిడీ పహారా సునక రాజ్యమా, శ్రామిక శక్తీ అజేయము ... 

మృత్యువులోనే పాట పాడుతాం... విప్లవమా నీకు లాల్ సలాం 
విప్లవమా నీకు లాల్ సలాం 
విప్లవమా నీకు లాల్ సలాం .... 

 నీ జాలి నాకు వోదు.. నీ ప్రేమ నాకు వొధు.. నాకు కావాల్సింది నా హక్కు .. నీ డబ్బు తో నాకు పనిలెధు.. నా మీద జాలి చూపించి నన్ను అవమనించకు.. 
నాకు శక్తీ ఉన్నాది... నాకు కావాల్సింది అవకాశం, జాలి కాదు

Monday, July 29, 2013

కారంచేడు కి 28 ఏళ్ళు - 28 Years for Karamchedu massacre

Karamchedu massacre happened in July 1985, dalits are brutally murdered by upper class landlords. This had no parallel in the Indian subcontinent.
In the memory of this here is a song written by Kalaikuri Prasad.

palle pallena.. dalita koila, bathuku paata paduchundaga
gunde gundena poru puttaga, bathukulona poru velasi velugu nindaga
saage pedholla jathara.. coolie gundello pandaga
saage pedholla jathara.. coolie gundello pandaga

palle pallena.. dalita koila,

akalitho pegulanni kekaleyaga raguluthunna gundelona paata puttaga
kaaruthunna raktham antha yerulavvaga.. mandhuthunna dokkalani dappulayera..
aatalai patalai dappulai gajjalai, gallu gallu galluna gudisekochera
badhalanni bakulai, bakulanni basalayi..
dalita janula gundeporu horulethaga..
saage pedholla jathara.. coolie gundello pandaga
saage pedholla jathara.. coolie gundello pandaga

palle pallena.. dalita koila,

kumuluthunna kooluthunna dalita jeevulu.. brathuku theruvu batalona poru saluputhu
ahuthaina amarulaina dalita veerula asayala sadhanakai kadham thokkuthu
dikku mokku leni janam okkatai kadhilithenu dopidolla gundelonu vonuku puttera
debbathina dalita gunde dalita gandu kattithelu .. hanthakulla gundellanni adhiripoyera

saage pedholla jathara.. coolie gundello pandaga
saage pedholla jathara.. coolie gundello pandaga

palle pallena.. dalita koila,


anachabadda bathukulanni aggiravvalai.. antarani matallallo udhaya taralai..
alumukunna andhakara mandhiralanu..chal.. bhagguna bhookampamai kulchiveyara..
urumuthu urumulai.. porujanda veerulai pidugulaga adugu vesthu natyamadaga
coolie thalli biddalai, dalitha seema dandulai daluthunatha rajyamele ranam cheyaga..

saage pedholla jathara.. coolie gundello pandaga
saage pedholla jathara.. coolie gundello pandaga

palle pallena.. dalita koila, bathuku paata paduchundaga
gunde gundena poru puttaga, bathukulona poru velasi velugu nindaga
saage pedholla jathara.. coolie gundello pandaga
saage pedholla jathara.. coolie gundello pandaga

Sunday, July 7, 2013

చిలక పలుకు, బ్రతుకు - Goreti venkanna

మడుగుల్లో మైలంటదు నీకు కొంగమ్మ
మాసిపోని తనువున్న కొంగమ్మ ... క్షణమైనా చూసి మురిసిపోవే కొంగమ్మ.

రామచిలక, పాలపిట్ట, నరుడు పెట్టిన పేర్లుతప్ప, తమకు ఊర్లు పేర్లు తెలవదు...
ఆ పేరు కోసం వూరు కోసం ఉనికి కోసం ఈసమన్త ఆత్రం లేదు...
ఓ పుల్ల ఓ పుడక, ఎండు గడ్డి, చిన్న కొంప చిట్టి గూడు .. పిట్ట బ్రతుకే హయిగదర.. చిగురుటాకు, వగరు పూత, లేత పిందే , తీపి పండు నోటికంది చింత లేక కునుకు తీసే, పిట్ట బ్రతుకే హయిగదర..!!

ఈ పుటకు ఉంటె అంతే చాలు రేపు కోసం బాధ లేదు దాచుకోనేటి గుణము లేదు, లోభిథానము ఎరుక లేదు... చదువు చెప్పే శాల లేదు ... బోధ చెప్పే గురువు లేడు.
వొనుకు వస్తే ఉడుకు లేదు... రోగమొస్తే మందు లేదు
అన్ని ఉన్న నరుడు మాత్రం ఆశ, లోభం వెంట.. ఏమి లేని పిట్ట చెంతచేరి జథకమ్ము అడుగుతున్డుజుడు...

-- గోరేటి వెంకన్న









Sunday, January 27, 2013

మన భష పక్కవాడికి బాధ, వాడి భాష మనకి చులకన.

మన తెలుగు సినిమాల్లో తెలంగాణా మాట్లాడే వాళ్ళు రౌడీగా పనివాళ్ళుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు?

తెలంగాణా అంటే అంత చులకన మనకి, అది మైనారిటీ కింద జమకడతాం .. ఎలా అంటే, ఒక తెల్లవాడు ఆఫ్రికా పోయి అక్కడ వాళ్ళు అంతా మైనారిటీ అన్నట్టు, ఆంధ్ర లో వాళ్ళు తెలంగాణా వెళ్లి వాళ్ళని మైనారిటీ అనడం అంతే వెర్రి ఆలోచన.

అలాగ రెండు జిల్లలో వాడుక భాష అయిన తెలుగునే పత్రికల్లో ప్రచురించి, పద్యాలు ఇంక ఏ వాడుక భాషలో రాసిన అందులో సాహిత్యం లేదని, సరసం లేదని, ఇంకేదో లేదని కొట్టి పారేసి ఆంధ్రకవులు తమ భాష స్వార్ధాన్ని చాటేసుకున్నారు. ఆంధ్ర ప్రాంత సాహిత్య నిపుణులు ఏకపక్షంగా వారి ప్రామాణిక భాష, తెలుగు అని..  మరియు తెలంగాణ భాష. ఒక సాధారణ మాండలికంగా  ఖండించారు. కేవలం రెండు జిల్లాలు వాడుక భాషగా ఉండే తెలుగు ని ఎక్కువ చేసి, తొమ్మిది కంటే ఎక్కువ జిల్లాలు మాట్లాడే తెలంగాణ భాషా మాండలికం గా ప్రకటించటం లో తెలంగాణా వాస్తవ్యులను తీవ్రమైన అవమానానికి గురిచేసారు.

మన రాష్ట్రం లో కవుల పేర్లు అడిగితే శ్రీనాధుడు, విశ్వనాధ శాస్త్రి, గబ్బిలం జాషువా, నన్నయ, ఎర్రాప్రగడ లాంటి కోస్తాంధ్ర కవులే ఎందుకు చెప్పుకుంటున్నాం? శ్రీ కాలోజీ నారాయణ రావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, గోన బుద్ధా రెడ్డి ఇంకెందరో ఉన్నారు వీరి గురించి ఎందుకు రాస్కోలేదు మన పుస్తకాల్లో?   అచ్చ తెలుగులో ఎన్నో సంస్కృత పదాలు ఉన్నాయి, అలాంటి కట్టిన శబ్ద ప్రయోగానికి జై జై లు కొడతారు..  ఈమధ్య చొక్కా, నిక్కరు లాంటి చిన్న చిన్న వాడుక పదాలను ఇంగ్లీష్ లో పలుకుతారు.. అలా మాట్లాడితే ప్రోత్సహిస్తారు... కాని ఉర్దూ తో కలిసిన తెలుగు మాట్లాడితే, తురక తెలుగు అని హేళన చేస్తారు. Noam Chomsky చెప్పినట్టు, భాషలోనే ప్రాంతం యొక్క సంస్కృతి ఇమిడి ఉన్నాది. భాషాశాస్త్రం ఒక మానవశాస్త్ర విధానంగా పరిశోధన చేసారు.   ఎవరి భాష వారికీ ఆనందం, వాడుక భాషనీ బ్రతికించండి,కానీ పక్కవారి భాషనూ కించపరిచి మన భాషను ఎక్కువ చెయ్యడం లో ఏ ప్రగతిశీలత కనిపించదు. ఈ దురాగతాన్ని ఆపుదాం, అందరిని, అన్ని భాషలని  సమానం గా గుర్తిదాం.